విషాదం : క్రికెట్ ఆడుతూ పిచ్ పైనే చనిపోయాడు..!

మహారాష్ట్రలోని పూణెలో విషాదం చోటుచేసుకుంది. ఓ క్రీడాకారుడు క్రికెట్ ఆడుతూ పిచ్ పైనే కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వచ్చి చూడగానే చనిపోయాడు. పూణెలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్ మెన్ బంతిని కొట్టగా పరుగు కోసం ప్రయత్నించారు. అయితే బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి పోవడంతో పరుగు తీసుకోలేదు. 

నాన్ స్ట్రయిక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్ మెన్ బాబు నల్వాడే కూడా వెనక్కి వచ్చాడు. కొద్ది సేపటికి బాబు బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ తర్వాత క్రీజులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగా అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Leave a Comment