ప్రతి ఆలయంలో గోవును పూజించాలి..!

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గుడికో గో మాత కార్యక్రమం సోమవారం ఉదయం  ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ  ప్రతి ఆలయంలో ఒక గోవును కచ్చితంగా పూజించాలన్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుంచి గోవులను తీసుకువచ్చి అమ్మవారికి ఇచ్చామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలలో గోవులను అందిస్తామన్నారు. భక్తులు గోవులను దానము చేయాలనుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానానికి గోవులను దానం చేయాలని కోరారు. గోవు సంరక్షణకు నిమిత్తము ఆలయ అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నారు.

మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం ప్రారంభించాం అన్నారు. దాతలు కూడా ముందుకు వచ్చి టీటీడీ, హిందు ప్రచార పరిషత్ కి గోవులు అందజేయాల‌న్నారు..

 

Leave a Comment