కొత్త జంటకు పెట్రోల్, గ్యాస్ గిఫ్ట్..!

సాధారణంగా పెళ్లియిన కొత్త జంటకు కానుకలు ఇవ్వడం సర్వసాధారణం. వారిని నచ్చిన కానుకలు ఇస్తూ ఉంటారు వారి స్నేహితులు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈక్రమంలో ఓ కొత్త జంటకు వారి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తాజాగా చెన్నైకి చెందిన ఓ జంటకు పెట్రోల్, గ్యాస్ సిలిండర్, ఉల్లిగడ్డలను కానుకగా ఇచ్చారు. పెట్రోల్ బాటిల్, గ్యాస్ సిలిండర్ ను వారి చేతికి అందించి, ఉల్లిపాయలను దండగా చేసి వారి మెడలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అవి చాలా ఖరీదైన కానుకలు భద్రంగా దాచుకోండి’, ‘పెళ్లికానుకలు అద్భుతంగా ఉన్నాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment