పెళ్లి ఖర్చు రూ.37 లక్షలను కోవిడ్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన జంట..!

పెళ్లంటేనే భారీ సెట్టింగులు, రకరకాల ఆహార పదార్థాలు, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్స్ అబ్బో అన్ని ఇన్ని కావు.. దాని కోసం లక్షల రూపాయాల్లో ఖర్చు అవుతుంది. కానీ తమిళనాడులోని ఓ జంట మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. అంతే కాదు పెళ్లిలో మిగిలిన డబ్బును కోవిడ్ సహాయ నిధికి ఇచ్చింది. 

తమిళనాడుకు చెందిన అను, అరుల్ ప్రాణేశ్ అనే వధూవరులు తమ పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే లాక్ డౌన్ ఉండటంతో ఈనెల 14న వట్టమాలై అంగలమ్మన్ ఆలయంలో పెళ్లి జరిగింది. పెళ్లి చాలా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. 

దీంతో పెళ్లికి రూ.13 లక్షలు మాత్రమే ఖర్చ అయింది. మిగిలిన రూ.37 లక్షలను ఆ జంట రాష్ట్రంలో పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. కోవిడ్ భయం కారణంగా చాలా మందిని ఆహ్వానించినా రాలేదని, చివరికి ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా తాము ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారని వరుడు అరుల్ ప్రాణేశ్ తెలిపాడు. 

Leave a Comment