ఆరోగ్యశ్రీలో కరోనాకు చోటు..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేస్తున్న వైస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ పథకం లో  కరోనా వ్యాధి ని చేరుస్తు వైస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు కృష్ణ జిల్లా కోఆర్డినేటర్ పి.సంతోష్  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో నమోదు కాబడిన అన్ని ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేకమైన వార్డుతో 50 బెడ్ల హాస్పిటల్స్ లో ఒక గది మరియు రెండు పడకలు, 100 బెడ్ల హాస్పిటల్స్ లో ఒక గది, నాలుగు పడకలు, 100 కన్నా ఎక్కువ బెడ్లు గల హాస్పిటల్స్ లో రెండు గదులు 10 కి పైనే పడకలు ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగా అన్ని హాస్పిటల్స్ లో  వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు మెడికల్ కిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 14 రకాల చికిత్స లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరైనా కరోనా వ్యాధి లక్షణాలుండి ఆసుపత్రుల ల్లో చేరితే ఉచితంగా చికిత్స అందించాలని, వైరస్ అనుమానిత లక్షణాలతో ఉన్న వైద్యం అందించేందుకు రూ. 10 వేలు, పాజిటివ్ కేసులకు వైద్యమందిస్తే రూ.20 అదనంగా ఇస్తామని సంతోష్ పేర్కొన్నారు. 

Leave a Comment