తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం లక్షణాలతో కరోనా..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా రూటు మారుస్తోంది. కొత్త లక్షణాలతో దడపుట్టిస్తోంది. అసలు అంచనా వేయని కొత్త లక్షణాలతో బయటకు వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కొత్త రకం క్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు WHO, ICMR కరోనా వైరస్ కు కొన్ని లక్షణాలను నిర్ధారించాయి. అయితే ఆ లక్షణాలకు భిన్నమైన లక్షణాలతో కరోనా పాజిటివ్ వస్తుంది. దీంతో ఏ లక్షణాలుంటే కరోనా పాజిటివ్ అనుకోవాలో అర్థం కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుత మార్పులను అంచనా వేసి వాటి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ కసరత్తు చేస్తున్నాయి. 

ఇప్పటి వరకు ఉన్న లక్షణాలు..

 • జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోలేపోవడం .
 • కళ్లలో ఏమైన తేడా అనిపిస్తే పాజిటివ్ అనుకోవడం.
 • శరీరం అలసిపోయినట్లు ఉండటం.
 • గొంతు తడారినట్లు ఉండటం.
 • పొడిదగ్గు ఎక్కువగా ఉండటం..ఊపిరితిత్తులు ఛిన్నాభిన్నం కావడం.
 • ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం.

కొత్త రకం లక్షణాలు..

 • కడుపులో వికారం
 • నీళ్ల విరేచనాలు ఎక్కువగా కావడం.
 • వాంతులు కావడం.
 • కడుపు ఉబ్బరంగా ఉండటం.
 • ఆహారం జీర్ణంకాకపోవడం.
 • చర్మంపై దద్దుర్లు
 • అరికాళ్లలో తిమ్మర్లు రావడం.
 • మూర్ఛ రావడం, నత్తిగా మాట్లాడం.

Leave a Comment