నయాదందా : ఈ కార్డు ధరిస్తే కరోనా రాదు..!

ప్రజల్లో కరోనా వైరస్ భయం రోజురోజుకు పెరిగిపోతోంది. వారిలో ఉన్న కరోనా భయాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. మేడ్ ఇన్ జపాన్ ‘వైరస్ షట్ అవుట్’ పేరుతో తయారైన కార్డులు మెడలో వేసుకుంటే చుట్టూ ఒక మీటర్ వరకు కరోనా దగ్గరికి రాదని అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రచారం చేస్తున్నారు. రూ.300లకు అమ్ముతున్న ఈ కార్డు ఒక నెల పని చేస్తుందని, ఇందులో ఉన్న సోడియం క్లోరైడ్, న్యాచురల్ జియోలైట్ రసాయన మిశ్రమం శరీరానికి రక్షణ ఇస్తుందని జనాలను నమ్మిస్తున్నారు. ఇక ఈ కార్డు ధరిస్తున్నాం కదా..వైరస్ మన దగ్గరికి రాదు అన్న ధైర్యంతో ప్రజలు మాస్కులు వేసుకోవడం లేదు. 

Leave a Comment