కరోనాపై పోరాటంలో మా చదువులను త్యాగం చేస్తాం..వీడియో వైరల్..!

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈనేపథ్యంలో చాలా పాఠశాలలు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది విద్యార్థులు ఆన్ లైన్ చదువులు కొనసాగించలేక కష్టాలు పడుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు పిల్లలు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో ఆ పిల్లలు ఆమాయకంగా ప్రధాని మోడీని ఉద్దేశించి చెప్పారు. ‘మోడీ జీ కరోనాతో పోరాటం కోసం మా చదువును త్యాగం చేయాల్సి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏడేళ్ల పాటు పాఠశాలలు మూసివేయాల్సి వస్తే, మేము ఆ త్యాగానికి సిద్ధంగా ఉంటాం’ అని ఇద్దరు పిల్లలు చేసిన కామెడీ వీడియో ఆకట్టుకుంటుంది. 

Leave a Comment