భారత్ లో కరోనా వైరస్ అసలు ఆట ఇప్పుడే మొదలు…

దేశంలో కరోనా కేసల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని సంబరపడ్డాం. ఇతర దేశాలు కూడా భారతదేశం చేపట్టిన చర్యలను కీర్తించాయి. కానీ  భారతదేశంలో కోవిడ్-19 ఆట ఇప్పుడే మొదలైంది. కరోనా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పట్టికలో భారత్ ఆరో స్థానంలో ఉంది.

భారత్ లో మొదటి కేసు నుంచి లక్ష కేసులకు చేరుకోవడానికి 110 రోజులు పడితే, లక్ష నుంచి రెండు లక్షలకు చేరడానికి 15 రోజులు మాత్రమే పట్టింది. స్పెయిన్, జర్మనీ, ఇటలీ మరియు యూకేలలో లాక్ డౌన్ సమయంలో కేసులు అమాంతంగా పెరిగినా అన్ లాక్ తర్వాత కేసులు తగ్గుతున్నాయి. కానీ భారత్ లో లాక్ డౌన్ విధించినప్పుడు కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే అన్ లాక్ చేసిన తర్వాత కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో ఒక వారంలోనే రెట్టింపు కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

భారత్ సరైన సమయంలో లాక్ డౌన్ విధించడంతో ఇప్పటి వరకు కరోనాను బాగా నియంత్రించిందని, అయితే దేశాన్ని అన్ లాక్ చేసే క్రమంలో భారీగా కేసులు పెరిగే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ అధికారి హెచ్చరించారు. 

ముంబైలో పరిస్థితి దారుణం..

ముంబైలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒకే బెడ్ మీద ఇద్దరు కోవిడ్ పేషెంట్లు, రెండు బెడ్స్ మధ్యలో ఉన్న ఖాళీలో కూడా పేషెంట్స్, వెంటిలేటరస్ చాలని పరిస్థితి ఏర్పడింది. వైద్యం అందక కొందరు చనిపోతున్నారు.  మనం కూడా ఆ స్టేజి లోకి వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

హైదరాబాద్ లో ఉస్మానియాలో 25 డాక్టర్లు, నిమ్స్ లో ఐదుగురు గుండె డాక్టర్లు, ఐదు గురు హెల్త్ వర్కర్స్ ఇన్ఫెక్టు అయ్యారు. 25 మంది డాక్టర్లు హాస్టల్ వారు కావటం వల్ల, సుమారు 600 మంది డాక్టర్లను క్వారంటీన్ కి పంపించారు. 600 మంది డాక్టర్లు ఒక్కసారిగా పని మానేస్తే , పేషెంట్స్ ఇబ్బందులు చెప్పనక్కర్లేదు..

రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోక, ప్రైవేట్ హాస్పిటల్స్ రంగం లోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కనీసం రూ. 7 లక్షలు తగ్గకుండా బిల్ అవుతుంది. ఇదే విధంగా డాక్టర్లు కూడా ఇన్ ఫెక్ట్ అయి క్వారంటీన్ కి వెళ్తే, కొన్ని రోజుల్లోనే ఆరోగ్య శాఖ చేతులెతోస్తుంది. డబ్బు ఉన్నా వైద్యులు ఉండరు.. వైద్యులు ఉన్నా వెంటిలేటర్స్ ఉండవు..

అత్యధిక జనాభా కలిగిన భారత్ లో నమోదవుతున్న కేసులను చూస్తే దానిని విజ్రుంభణగా భావించలేమని, ప్రస్తుతం మార్కెట్ ఓపెన్ అవడంతో కేసులు పెరిగే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ రయాన్ హెచ్చరించారు. ఈ దశలో కేసులు మూడు వారాల్లోనే రెట్టింపు అవుతాయని చెప్పారు. ఇప్పుడే భారత్ సామూహిక వ్యాప్తి దశకు చేరుకుంటోందని, మితి మీరి కేసులు నమోదవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా ప్రభావం భారత్ లో పట్టణాలు, పల్లెల మధ్య చాలా వ్యత్యాసం ఉందని రయాన్ వివరించారు. 

కరోనా వైరస్ భారత్ లో సెప్టెంబర్ రెండో వారం నాటికి అంతమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ రూపాలీ రాయ్ చెప్పారు. గణిత నమూనా ఆధారంగా చేసిన ఓ విశ్లేషణను బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు. 

 

Leave a Comment