కరోనా వైరస్ నిధుల సేకరణ పేరుతో మోసాలు..

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నకిలీ ఐడీ..

కరోనా వైరస్ నిధుల సేకరణ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. ప్రస్తుతం ఇలాంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెంట్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్(PM-CARES) ఫండ్ పేరుతో నకిలీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ఐడీని సృష్టించినట్లు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ హెచ్చరించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చక్కర్లు కొడుతున్న ఇలాంటి ఫేక్ యూపీఐ ఐడీలపై జాగ్రత్తగా ఉండాలని దాతలకు ప్రభుత్వం హెచ్చరిస్తుంది. PM-CareFunds యొక్క సరైన యూపీఐ ఐడీ ‘pmcares@sbi’ అని PIB ఫాక్ట్ చెక్ ట్విట్ చేసింది. 

దేశంలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి PM-CARES ఫండ్ యొక్క మోసాన్ని ఒక వ్యక్తి  గుర్తించాడు. ఢిల్లీ పోలీసులు కథనం ప్రకారం, యూజర్@బిష్వేష్0604 ట్విట్టల్ ఐడీ ద్వారా నకిలీ ఐడీ గురించి అప్రమత్తం చేశాడు. PM-CARES ఫండ్ యొక్క సరైన యూపీఐ ఐడీ pmcares@sbi అని, దానికి బదులు pmcare@sbi పేరుతో నకిలీ ఐడీ చక్కర్లు కొడుతుందని ప్రజలను అప్రమత్తం చేశాడు. 

ఈ నకిలీ యూపీఐ ఐడీ గురించి తెలయజేసినందుకు ఎస్బీఐ ఆ వ్యక్తిని అభినందించింది. తమ యూపీఐ గ్రూపును అప్రమత్తం చేశామని, దానిని నిరోధించే పనిలో ఉన్నామని చెప్పింది. ఇలాంటి నకిలీ ఐడీలను దాతలు గమనించాలని కోరింది. 

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ పోరాటంలో ప్రజలు సహకరించాలని, దీని కోసం అత్యవసర పరిస్థితుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రకటించారు. 

PM Cares ఫండ్ కు ఎలా విరాళాలు ఇవ్వాలి?

ప్రజలు మరియు సంస్థలు ఈ కింది వివరాలను ఉపయోగించి pmindia.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి PM Cares ఫండ్ కు విరాళం ఇవ్వొచ్చు. 

ఖాతా పేరు – PM Cares 

ఖాతా సంఖ్య- 2121 PM20202

IFSC code – SBIN0000691

SWIFT code – SBININBB104

బ్యాంక్ మరియు బ్రాంచ్ పేరు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ మెయిన్ బ్రాంచ్

UPI ID – pmcares@sbi.

వెబ్ సైట్ లో లభించే చెల్లింపుల పద్ధతుల్లో డెబిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ(భీమ్, ఫోన్ పే, అమెజాన్ పే, గూగుల్ పే, పేటీఎం, మొబిక్విక్), ఆర్ టీజీఎస్ లేదా నెఫ్ట్ ఉన్నాయి. 

ఈ నిధికి విరాళాలు సెక్షన్ 80(జి) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించబడతాయి. ఈ నిధికి ఉదారంగా విరాళం ఇవ్వాలని ప్రజలను కోరారు. 

 

                                                           

Leave a Comment