ఇక వాయువేగంతో కరోనా.. ఎయిర్ బార్న్ వ్యాధిగా మారే అవకాశం..!

కరోనా మహమ్మారి ఇప్పటికే రకరకాల వేరియంట్లలో మారుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా మేరిల్యాండ్ యూనివర్సిటీ అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించారు నిపుణులు. కరోనా కొత్త వేరియంట్లు వాయు మార్గంలో ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని సంతరించుకుంటున్నాయని, ఈ శక్తి ఎక్కువ అయితే మహమ్మారి ఎయిర్ బార్న్ డిసీజ్ గా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా జలుబు చేసినప్పుడు చాలా తొందరగా ఇతరులకు అంటుకుంటుంది. ఎందుకంటే జలుబు లాంటి వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తాయి. వీటి ఏరోసాల్స్(గాలి తుంపర) ఎక్కువ దూరం పయనిస్తాయి. అంతేకాదు ఎక్కువకాలం గాల్లో ఉంటాయి.. ప్రస్తుతం కరోనా వైరస్ కూడా ఇలాంటి శక్తిని సాధించే ప్రయత్నాల్లో ఉందని, కరోనా వేరియంట్లు గాల్లో ప్రయాణించడంలో మెలకువలు సాధిస్తున్నాయని, దీని వల్ల కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనంలో వెల్లడైంది. 

కరోనా సోకిన వారు వదిలే గాలిలో వైరస్ ఉంటుంది. అల్ఫా వేరియంట్ సోకిన వారు వదిలే గాలిలో 43 నుంచి 100 రెట్లు అధికంగా వైరస్ లోడు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇప్పటి వరకు గాలో ఎక్కువ దూరం ప్రయాణించి ఇతరులకు సోకలేదు. అయితే గాలి ద్వారా ప్రయాణించే శక్తిని ఈ వేరియంట్లు పెంచుకుంటున్నాయి. దీని వల్ల వైరస్ ఏరోసాల్స్ పెరిగిపోతున్నాయని సీఐడీ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. 

దీంతో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, మరింత టైట్ ఫిట్ మాస్కులు ధరించాలని, ఇళ్లల్లో వెంటిలేషన్ ఏర్పరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని చెబుతున్నారు. అల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్ కు సంక్రమణ శక్తి అధికంగా ఉందని, ఈ వేరియంట్లు క్రమంగా గాల్లో ప్రయాణించడాన్ని అలవరుచుకంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ డాన్ మిల్టన్ చెప్పారు. ఇవి పూర్తిగా వాయుమార్గంలో సోకే వేరియంట్లుగా మారకుండా నిరోధించేందుకు, టీకా తీసుకోవడం, టైట్ మాస్కులు ధరించడం, శుభ్రమైన వాతావరణంలో నివసించడం చేయాలన్నారు. అయితే లూజు దుస్తులు, సర్జికల్ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు. 

Leave a Comment