మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ : మోడీ

కరోనా వ్యాక్సిన్ రాకపై ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని మోడీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వాక్సినేషన్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కే తొలి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. సుమారు ఎనిమిది వ్యాక్సిన్ లు ట్రయల్స్ దశలో ఉన్నాయని, భారత్ లో క్లినికల్ పరీక్షలు పూర్తి చేసుకునే దిశగా మూడు కంపెనీలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. కాబట్టి రానున్న కొన్ని వారాల్లో దేశంలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వాక్సినేషన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. 

Leave a Comment