కరోనా వ్యాక్సిన్ : క్లినికల్ ట్రయల్స్ విజయవంతం..!

కరోనా..ప్రతి ఒక్కరిలో గుబులుపుట్టిస్తున్న వార్త..ఈ వ్యాధి ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు అందరు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. దీనికి విరుగుడు చేసే వ్యాక్సిన్ తొందరగా రావాలని కోరుతున్నారు..ఈ వ్యాక్సిన్ తయారీకి ప్రపంచం మొత్తం ప్రయాత్నాలు చేస్తున్నాయి. భారత దేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంది. ఈ తరుణంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. 

రష్యాకు చెందిన సెచెనోవా యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ సక్సెస్ అయినట్లు ప్రకటించింది. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వాలంటీర్లపై తొలి వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్ చేశారు. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్లు వర్సీటీ విభాగ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ ఒక న్యూస్ ఏజెన్సీతో తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న ఫస్ట్ టీం బుధవారం డిశ్చార్జ్ అవుతుంది. రెండో బృందం కూడా జూలై 20న డిశ్చార్జ్ కానుంది. 

 

Leave a Comment