దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈనెల 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్..!

దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని వెల్లడించింది. తొలి దశలో ఈ వ్యాక్సినేషన్ ను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, ఫ్రంట్ లైన్ కార్మికులకు ఇస్తారని పేర్కొంది. ఇందులో భాగంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. 

మొదటి దశలో వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు. 50 ఏళ్ల లోపు ఉండి తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి కూడా టీకా వేయనున్నారు. వీరి సంఖ్య 27 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశమై.. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద చర్చించారు. ఈనెల 11న దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ వర్చువల్ భేటీకి ముందే కేంద్ర వ్యాక్సిన్ డ్రైవ్ మీద ఓ నిర్ణయానికి వచ్చింది.  

 

Leave a Comment