ఆ ప్రాంతాల్లోనే గాలి ద్వారా కరోనా వ్యాప్తి..!

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంగీకరించిది.  అయితే ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మందికిపైగా శాస్త్రవేత్తలు WHOకు లేఖ రాశారు. వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తోందని, దీనిపై మార్గదర్శకాలను సవరించాలని కోరారు. గతంలో కోవిడ్-19 ప్రధానంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని  WHO చెప్పింది. ఇప్పుడు గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయని, ఆ దిశగా మరిన్ని ఆధారాలు అవసరమని చెప్పింది.  

కానీ కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే ఇలా వ్యాపిస్తుందని స్పష్టం చేసింది. జనం రద్దీగా ఉండే ఇండోర్ ప్రదేశాల్లో, ఎక్కువ వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పింది. దీంతో పాటు వైరస్ సోకిన వ్యక్తులు తిరిగిన ఇండోర్ ప్రదేశాల్లో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని WHO తెలిపింది.  రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొంది. ఇక లక్షణాలే లేని వ్యక్తులతో వైరస్ వ్యాప్తి చాలా అరుదుఅని WHO స్పష్టం చేసింది. 

Leave a Comment