కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..!

కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు. అటు సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను చుట్టుముడుతోంది. నేడు కరోనా పాజిటివ్ తో యూపీ మంత్రి కమలా రాణి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నాను. రిపోర్టు పాజిటివ్  అని వచ్చింది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రస్తుతం డాక్టర్ సలహా మేరకు ఆస్పత్రిలో చేరాను. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారు దయ చేసి ఐసోలేషన్ ఉండి కరోనా టెస్టులు చేయించుకోండి’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. అయితే దేశంలో ఇప్పటి వరకు 17 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 

Leave a Comment