సోనూసూద్ కు కరోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలంటున్న అభిమానులు..!

లాక్ డౌన్ సమయంలో పేదల పాలిట దేవుడైన రియల్ హీరో సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.  ఈ రోజు ఉదయం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలిందన్నారు. ముందుజాగ్రత్తగా తాను ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొన్నాడు. 

ఎవరూ ఆందోళన చెందవద్దని సోనూసూద్ తెలిపారు. దీని వల్ల మీ సమస్యల పరిష్కారం కోసం తనకు చాలా సమయం దొరుకుతుందని, తాను మీ అందరివాడిని అనే విషయం గుర్తు పెట్టుకోండని సోనూసూద్ ట్టిట్టర్ లో పేర్కొన్నారు. దీంతో సోనూసూద్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా, సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. 

Leave a Comment