జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్..

జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారినపడ్డారు. ఇటీవల చేయించుకున్న పరీక్షలలో ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని, అంత కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. తాను, తన కుటుంబం ఐసోలేషన్ లో ఉన్నామని, అన్ని కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నామని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని కోరారు..

Leave a Comment