దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడింది. తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొద్ది రోజుల క్రితం కొంచెం జ్వరం వచ్చింది. అయితే అది తగ్గిపోయింది. అయినప్పటికీ మేము టెస్టులు చేయించుకున్నాం. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నాం’ అంటూ రాజమౌళి చెప్పారు. తాము త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేయాలనుకుంటున్నామని రాజమౌళి ట్వీట్ చేశారు. దీంతో రాజమౌళి త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. 

Leave a Comment