ఫోన్ పై 28 రోజుల వరకు కరోనా..

మనం కరోనా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తరచూ చేతులు పరిశుభ్రం చేసుకుంటున్నాం. మాస్కులు ధరిస్తున్నాం. కానీ మనం నిత్యం ఉపయోగించే వస్తువుల విషయంలో అశ్రద్ద చేస్తున్నాం. కానీ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. 

మనం నిత్యం ఉపయోగించే వస్తులపై కరోనా వైరస్ 28 రోజుల వరకు జీవించి ఉంటుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడైంది. కరెన్సీ నోట్లు, స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లు, గ్లాసులు, స్టెయిన్ లెస్ స్టీల్ వంటి వస్తువులపై కరోనా వైరస్ 28 రోజులు జీవించి ఉంటుంది తేలింది. అంతే కాదు తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ ఎక్కువ రోజులు ఉంటుందని స్పష్టమైంది. ప్లాస్టిక్ నోట్ల కంటే కాగితపు కరెన్సీ నోట్లు కరోనా వైరస్ అవాసానికి అనుకూలంగా ఉంటాయని, 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వైరస్ సున్నితమైన ఉపరితలాలపై 28 రోజుల దాకా జీవించి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. 

 

Leave a Comment