ఫన్నీ : కరోనా భయంతో డబ్బును మైక్రోవేవ్ లో వేడి చేశాడు..!

కరోనా భయం దక్షిణ కొరియన్లను వెంటాడుతోంది. దేన్ని పట్టుకుంటే కరోనా వైరస్ సోకుతుందో అన్న భయంతో వణికిపోతున్నారు. కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ ఉందేమోనన్న సందేహంతో ఓ వ్యక్తి కరెన్సీ నోట్లను మైక్రోవేవ్ మరియు వాషింగ్ మెషీన్లలో వేశాడు. ఈ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

కరోనా భయంతో ఆ వ్యక్తి కరెన్సీ నోట్లను వాషింగ్ మెషీన్ లో సర్ఫ్ వేసి ఉతికేశాడు. అప్పటికీ సందేహం తీరకపోవడంతో వాటిని మైక్రోవేవ్ లో పెట్టి వేడిచేశాడు. అయితే కరోనా పోవడం ఏమో కానీ నోట్లు సగానికిపైగా కాలిపోయాయి. వెంటనే వాటిని బ్యాంక్ కు తీసుకెళ్తే..సంగం రేటుకు విలువ కట్టి కొత్త కరెన్సీ నోట్లు ఇచ్చారు. 

Leave a Comment