కరోనా ఎఫెక్ట్ :  కేంద్రం సంచన నిర్ణయం

కరోనా ప్రభావంతో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసకుంది. విదేశాల్లో ఉన్న భారతీయులపై కేంద్రం నిషేధం విధించింది. ప్రవాస భారతీయులు దేశంలో అడుగు పెట్టకుండా చేసింది. ఈ నిషేధం మార్చి 31 వరకు అమలులో ఉండనుందని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ తెలిపారు. 

ఇప్పటికే దేశంలో 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14 మంది విముక్తి పొందగా, ముగ్గురు మరణించారు. దీంతో సోమవారం నాటికి 120 మంది ఉన్నారు. అయితే మంగళవారం ఒక్క రోజే 18 కేసులు నమోదు కావడంతో మరలా 138కి కేసుల సంఖ్య చేరింది. దీంతో విదేశీయులనే కాకుండా..ప్రవాస భారతీయులను కూడా ఇండియాకు రాకుండా ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇక అత్యవసరం ఉన్న వారికి కరోనా టెస్టులు నిర్వహించి..నెగిటివ్ అని తేలితేనే అనుమతిస్తారని సమచారం. గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు వచ్చే వారికి 14 రోజుల పాటు క్వారంటైన్ ను తప్పనిసరి చేసింది. 

Leave a Comment