ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కన పెట్టనుంది. 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధులకు రావొద్దంటూ చెప్పింది. 

బస్సులు యథావిధిగా తిరిగేంత వరకు విధులకు హాజరు కావద్దని ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశించింది. నెలకు రూ.60 కోట్ల జీతాలను కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్టీసీ చెల్లిస్తుంది. 13 జిల్లాల్లో సుమారు 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతానికి శాశ్వత సిబ్బందినే పనుల్లో వినియోగించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 

దీంతో ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. కరోనా దెబ్బకు ఆర్టీసీ ఎప్పుడు కోలుకుంటుందో తెలీదు. అంత వరకు 6 వేల కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 

 

Leave a Comment