తొలి దశలో ఆ ఐదు రాష్ట్రాలకు కరోనా మందు..

కరోనాతో అల్లాడుతున్న తరుణంలో దానికి మందు కనిపెట్టామని దేశంలో కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన హెటెరో కంపెనీ ‘రెమ్ డెసివిర్’ మెడిసిన్ ను తీసుకొచ్చింది. ‘కోవిఫర్’ పేరుతో దీన్ని విడుదల చేసింది. అయితే ఈ మందును తొలిదశలో దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న ఆ ఐదు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్ నగరాలకు  ఈ మందును పంపుతున్నట్లు హెటెరో కంపెనీ ప్రకటించింది. ఈ నగరాలకు 20 వేల ఇంజక్షన్లను అందించనున్నట్లు పేర్కొంది.  ఇక రెండో దశలో ఈ మెడిసిన్ ను విజయవాడ, కోల్ కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, కోచి, త్రివేండ్రం, గోవా నగరాలకు సరఫరా చేస్తామని సంస్థ తెలిపింది. 

ఈ మందు ప్రభుత్వం ద్వారా లేదా ఆస్పత్రుల ద్వారా మాత్రమే లభ్యమవుతుందని, రిటైల్ గా లభ్యమవదని సంస్థ స్పష్టం చేసింది. కోవిఫర్ ను 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంది. 100 ఎంజీ రెమ్ డిసివిర్ ఔషధానికి రూ.5,400 ఖర్చవుతుందని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని కంపెనీలో ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అటు సిప్లా కంపెనీ కూడా రెమ్ డెసివిర్ మందును మరో బ్రాండ్ పేరిట ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండు కంపెనీలకు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఈ మందు తయారీకి, పంపిణీకి అనుమతి లభించింది. 

 

Leave a Comment