మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు రాష్ట్రాల నుంచే ఎక్కువ..!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,172 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనూ 1000 కొత్త కేసులు వెలుగు చూశాయి.  దీంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. కేసుల పెరుగుదలపై కీలక ప్రకటన చేసింది. కొత్త కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో 1, 081 కేసులు నమోదయ్యాయి. ముంబాయిలో పాజిటివిటీ రేటు 8.4 శాతం చేరుకుందని వార్తలు వస్తున్నాయి. బుధవారం 4.41 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,712 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్ర, కేరళ నుంచే 2 వేలకు పైగా కేసులు వచ్చాయి.  

ఇక రోజువారి పాజిటివిటీ రేటు 0.05 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.67గా ఉంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 19, 509కి చేరాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు ఇప్పటి వరకు 98.74 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రభావంతో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. 

Leave a Comment