సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర..!

చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వంట గ్యాస్ ధరలను భారీగా పెంచాయి. ఏకంగా సిలిండర్ పై రూ.50 పెరిగింది. దీంతీ 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర తెలంగాణలో రూ.1,002కు, ఏపీలో రూ.1,008కి పెరిగింది. పెరిగిన ఈ ధర నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు చమురు కంపెనీలు వెల్లడించాయి. 

కాగా గత సంవత్సరం అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. దేశంలో ముడిసరుకు ధరలు పెరిగినప్పటికీ అక్టోబర్ నుంచి గ్యాస్ ధరలు పెంచలేదు. అయితే ఉక్రోయిన్ లో సంక్షోభం.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో చమురు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.349గా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ.669గా ఉంది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2003.50గా ఉంది. 

Leave a Comment