కరోనా వైరస్ వ్యాప్తిని ఆ సినిమాలు ముందే ఊహించాయా?

2011లో విడుదలైన హాలీవుడ్ సినిమా Contagion ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా అప్పట్లో పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అయినా ఇప్పుడా సినిమాకు ఎందుకంతా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాలో మాట్ డామన్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో, కేట్ విన్ స్లెట్, మైఖేల్ డగ్లస్ లాంటి స్టార్లు నటించారు. అయినప్పటికీ ఈ చిత్రం ఆ ఏడాది పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో 61వ స్థానంలో నిలిచింది. అయితే ఇదంతా ఎప్పుడు ఎందుకనుకుంటున్నారా?

చైనాలోని వూహాన్ నగరంలో వ్యాపించిన కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సవం అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాలు ఈ వైరస్ ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. దశాబ్దం కింద వచ్చిన ఈ సినిమాకు కథకు, ప్రస్తుత కరోనా వైరస్ కి మధ్య పోలికలు ఉండటమే అందుకు కారణం. 

మోస్ట్ సెర్చింగ్ మూవీ జాబితాలో..

ప్రస్తుతం  ఇప్పుడు ఆ చిత్రం బాగా సర్చింగ్ లో ఉంది. అమెరికాలోని యాపిల్ ఐట్యూన్స్ స్టోర్ లో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన సినిమాల జాబితాలో Contagion సినిమా ఉంది. ఈ చిత్రం పేరుతో గూగుల్ లో శోధనలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా, మన ఇండియాలోనూ ఈ సినిమా గురించి సర్చ్ చేస్తున్నారు. 

సినిమాపై ఎందుకంతా ఆసక్తి..?

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక వ్యాపారవేత్త అకస్మాత్తుగా వ్యాపించిన ఓ ప్రమాదకర వైరస్ బారిన పడి చనిపోతారు. చైనా పర్యటనలో ఉన్నప్పుడు ఆమెకు ఈ వైరస్ సోకుతుంది. తర్వాత ఆ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుంది. 

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కూడా చైనాలోనే మొదలైంది. ప్రస్తతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. లక్షల మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. వేలలో చనిపోతున్నారు. కాబట్టి ఈ సినిమా కథతో ప్రస్తుతం కరోనా వైరస్ ను పోల్చి చూస్తున్నారు. దీంతో గత కొంత కాలంగా ఈ సినిమాను వీక్షించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 

ప్రస్తుత పరిస్థితులకు, సినిమాకు మధ్య పోలికలు..

Contagion సినిమాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు దగ్గర అనిపించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో పాల్ట్రో పాత్రకు సోకిన వైరస్ పేరు MEV-1. గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందే ఆ వైరస్ ఓ పందికి సోకుతుంది. ఆ పంది మాంసాన్ని తాకిన ఓ హాంగ్ కాంగ్ చెఫ్, పాల్ట్రోకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలా ఆ వైరస్ పాల్ట్రోకు సంక్రమిస్తుంది. 

ఆ వైరస్ సోకిన పాల్ట్రో ఇంటికి వెళ్లిపోయాక తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. తర్వాత కొద్ది రోజులకే చనిపోతారు. అనంతరం ఆమె కుమారుడు కూడా ఈ వైరస్ ధాటికి చినిపోతాడు. ఆమె భర్తగా నటించిన మాట్ డామన్ లో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండటంతో ఆయన ప్రాణాలతో ఉంటాడు. 

నిజ జీవితంలో..

ప్రస్తుతం చైనాలోని వూహాన్ లో వ్యాపించిన కరోనా వైరస్ మొదట జంతువుల నుంచి మనుషులకు సంక్రమించి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 2002-03 లో వ్యాపించిన సార్స్ మహమ్మారి మాదిరిగానే ఈ కరోనా వైరస్ కూడా గబ్బిలాలలో పుట్టి, తరువాత మరో జాతి జీవి ద్వారా మనుషులకు వ్యాపించి ఉంటుందని అంటున్నారు. 

ప్రస్తుత కరోనా వైరస్ మాదిరిగానే, ఆ సినిమాలో చూపించిన వైరస్ కూడా బాధితులతో సన్నిహితంగా ఉండటం, కరచాలనం చేయడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. 

వైరస్ సోకిన వారికి శ్వాస కోవ సమస్యలు వస్తాయని సినిమాలో చూపించినట్లు నిజజీవితంలో కరోనా వైరస్ సోకిన వారికి కూడా ఇలాంటి సమస్యలే వస్తున్నాయి. 

Contagion సినిమాలో పంది నుంచి వ్యాపించినట్లు చూపించారు. అయితే కరోనా వైరస్ కూడా వూహాన్ లోని జంతువుల మార్కెట్ నుంచి వ్యాప్తి చెందిందని చైనా అధికారులు గుర్తించారు. 

సినిమాలో వైరస్ సోకిన వారిని నిర్బంధ పరిశీలనలో ఉంచి పరీక్షిస్తారు. సినిమాలో అమెరికాలోని షికాగో నగరాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో చైనాలోని వూహాన్ నగరాన్ని మూసివేశారు.

అయితే సినిమాలో చూపించనట్లు నిజ జీవితంలో అంతగా ప్రాణనష్టం అయితే జరగట్లేదు. సినిమాలో ఈ వైరస్ బారినపడి నెల రోజుల్లోనే కోట్లలో జనాలు చనిపోతారని చూపించారు. కానీ చైనాలో కరోనా వైరస్ వ్యాపించి మూడు నెలలు అవుతున్నా దాని బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 4వేలు దాటలేదు. 

కరోనా వైరస్ వ్యాప్తికి, కంటేజియన్ సినిమా కథకు మధ్య పోలీకలు ఉండటంతో ఈ సినిమాకు భారీగా డిమాండ్ పెరిగింది. 

దీనిపై మరిన్నీ సినిమాలు…

కంటీజియన్ సినిమానే కాకుండా మరి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు కరోనా వైరస్ గురించి పస్తావన తెచ్చాయి. 2018లో వచ్చిన దక్షిణ కొరియా వెబ్ సిరీస్ ‘My Secret, Terrius’ కరోనా వైరస్ గురించి తెలిపింది. ఇది Netflix లో బాగా ప్రచారంలో ఉంది. ఇదే కాకుండా చాలా సినిమాలు ఈ వైరస్ ప్రస్తావను తెచ్చాయి. 

అయితే ఇందులో విశేషం ఏంటంటే వచ్చిన ప్రతి సినిమా కూడా చైనా నుంచి వైరస్ వ్యాపించినట్లు చూపించాయి. దీన్ని బట్టి చైనా నుంచి వైరస్ వ్యాపిస్తున్నట్లు వారు ముందే ఊహించాారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

Leave a Comment