మహిళకు కానిస్టేబుల్ వేధింపులు.. దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు..!

మహిళలు వేధింపులకు గురైతే పోలీసులు రక్షణ ఉంటారు. కానీ రక్షణగా ఉండాల్సిన పోలీసే మహిళను వేధిస్తే.. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. మహిళను వేధించిన ఆ కానిస్టేబుల్ ను కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. 

తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను మాచవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్ ఎం.శివరామకృష్ణ కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనను వెంబడిస్తూ మాట్లాడాలని ఒత్తిడి చేశాడు. కాగా, రెండు రోజుల క్రితం ఆ మహిళ విజయవాడ వెళ్లింది. 

ఆమె తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న ఆటోను వెంబడించాడు. కుంచనపల్లిలోని ఆమె ఇంటి వరకు వచ్చాడు. బుధవారం ఉదయం ఆ మహిళ అంగన్ వాడీ స్కూల్ దగ్గర పిల్లలను వదిలిపెట్టేందుకు వెళ్లింది. అక్కడ ఆ మహిళను రోడ్డుపై అడ్డగించి ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ వేధించాడు. 

దీంతో ఆ మహిళ తన భర్తకు, బంధువులకు ఫోన్ చేసింది. వెంటనే ఆ మహిళ బంధువులు అక్కడికి వచ్చారు. కానిస్టేబుల్ శివరామకృష్ణను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు బైక్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. మహిళ బంధువులు అతడిని వెంబడించిన పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.   

Leave a Comment