Video Viral: రోడ్లు అడిగిన యువకుడు.. చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే..!

కర్ణాటకలోని తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలు అడిగినందుకు.. ఓ యువకుడి చెంప పగలగొట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట రమణప్ప.. ఈ చెంప దెబ్బ వీడియో వైరల్ కావడంతో ఇది స్థానికంగా దుమారం రేపింది. ఏంజరిగిందంటే.. ఈనెల 19న తూమకూరు జిల్లాలోని తాలూకా ఆఫీస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణప్ప ఓ సమావేశంలో పాల్గొన్నారు. 

సమావేశం నుంచి బయటకు వస్తుండగా.. నాగేనహళ్లికి చెందిన నరేంద్ర అనే యువకుడు తమ గ్రామాలకు రోడ్లు ఎప్పుడు వేస్తారని ఎమ్మెల్యేను అడిగాడు. దీంతో త్వరలోనే మీ గ్రామాలకు రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆ యువకుడు మాత్రం ‘ఏ నా కొడుకూ వినిపించుకోడు’ అని ఎమ్మెల్యే ముందు అన్నారు. 

దీంతో ఎమ్మెల్యే కోపంతో ఆ యువకుడిని చెంప దెబ్బ కొట్టారు. అనంతరం ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈ చెంప దెబ్బ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ నాయకుడు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆందోలన చేశారు. రోడ్డు వేయాలని అడిగితే కొడతారా అంటూ ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.        

 

Leave a Comment