జబర్దస్త్ హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు..!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో హైపర్ ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

హైపర్ ఆది, స్క్రిప్ట్ రైటర్ తో పాటు మల్లెమాల ప్రొడక్షన్ పై చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. గతంలోనూ హైపర్ ఆదిపై పలు ఆరోపణలు వచ్చాయి. డబుల్ మీనింగ్ డైలాగులు, హద్దు మీరిన కామెడీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి.   

 

Leave a Comment