దీపావళి ముందు భారీ షాక్.. గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు.. ఎంత అంటే?

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఈక్రమంలో సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో గుదిబండను మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకండా రూ.266లు పెంచేసింది. ఈ పెంపుతో హైదరబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1905.32కి చేరింది. ఢిల్లీలో రూ.2000.5, ముంబాయిలో రూ.1950, కోల్ కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133గా ఉంది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆగస్టు 17న పెంచిన కేంద్రం.. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ ఇచ్చింది. అయితే రెండు నెలల తర్వాత ఒకేసారి రూ.266 పెంచింది. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో చిరువ్యాపారులు, స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు కష్టాలు తప్పవు. అందరూ దీపావళి తర్వాత పెండు ఉండొచ్చని భావించారు. కానీ దీపావళికి ముందే కేంద్రం రికార్డు స్థాయిలో ధరను పెంచేసింది. అయితే 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచలేదు. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై సెప్టెంబర్ లో రూ.15, అక్టోబర్ లో రూ.25 వంతున ధర పెంచారు. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.205 పెరిగింది.  

 

Leave a Comment