ఆస్పత్రిలో చొరబడి రోగులను కుమ్మేసిన ఆవు..!

ఆవు ఒక సాధు జంతువు. అవి సామాన్యంగా ఎవరికీ హానీ చేయవు. కానీ ఈ ఆవుకు ఏం కోపం వచ్చిందో.. ఆస్పత్రిలో చొరబడి మరీ అక్కడ వచ్చిన రోగులు, వారి బంధువులను కుమ్మేసింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జరగిందంటే.. 

దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని సాన్ రాఫెల్ ఆస్పత్రిలోని వెయింటింగ్ రూంలోకి ఓ ఆవు వచ్చింది. వెయిటింగ్ రూంలో రోగులతో పాటు వారితో వచ్చిన వారు కూర్చిని ఉన్నారు. ఆ రూంలోకి సైలెంట్ గా వచ్చిన ఆవు ఒక్కసారిగా అక్కడ కూర్చున్న వారిపై దాడి చేసింది. 

అక్కడ ఉన్న వారు కొందరు తప్పించుకున్నారు. అయితే అక్కడ ఇరుక్కుపోయిన మహిళను మాత్రం ఆవు వీరలెవల్లో కుమ్మేసింది. గోడకు ఆనించి మరీ కొట్టింది. అక్కడి సిబ్బంది ఆవు మెడకు ఉన్న తాడును లాగేందుకు ప్రయత్నించినా కదల్లేదు. అక్కడక్కడే తిరుగుతూ వీరవిహారం చేసింది. 

దాడి చేసిన మహిళ అక్కడే పడి ఉంటే మరోసారి ఆమెపై దాడి చేసేందుకు సిద్ధమైంది. ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆవును వెనక్కి వచ్చారు. దీంతో ఆవు మహిళను వదిలి వాళ్ల వైపు తిరిగింది. ఇంతలో ఆ మహిళ ఎలాగోలా పక్కరూంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది. ఇక గదిలో ఎవరూ లేకపోవడంతో ఆవె మెల్లగా బయటకు వచ్చింది. ఇదంతా ఆస్పత్రి సిసి కెమెరాలో రికార్డు అయింది. 

Leave a Comment