ఇంగ్లీష్ లో 35, గణితంలో 36.. కలెక్టర్ మార్కుల జాబితా వైరల్..!

పరీక్షల్లో మార్కులు తక్కవ వచ్చినా.. ఫెయిల్ అయినా.. ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు కొందరు విద్యార్థులు.. తామే జీవితంలో ఏమీ సాధించలేమని క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ.. ఓ సాధారణ విద్యార్థి కలెక్టర్ అయితే.. తాజాగా కలెక్టర్ తుషార్ డి సుమేరా పదో తరగతి మార్కుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ జాబితాలో ఆయనకు ఇంగ్లీష్ లో 35, గణితంలో 36 మార్కులు మాత్రమే వచ్చాయి. 

సుమేరా మార్కుల జాబితాను 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనిశ్ శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పలు రాష్ట్రాల్లో పది ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో.. తక్కువ మార్కులు వస్తే కుంగిపోవద్దని తెలియజేసేలా సుమేరా ఫొటోతో పాటు ఆయన మార్కుల మెమోను షేర్ చేశారు. సుమేరా 2012 బ్చాచ్ ఐఏఎస్ అధికారి.. ప్రస్తుతం ఆయన గుజరాత్ లోని భరుచ్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 

టెన్త్ పరీక్షల్లో సుమేరా కేవలం పాస్ మార్కులనే సాధించారని, ఆయన కు ఇంగ్లీష్ లో 35, మ్యాథ్స్ లో 36 మార్కులు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. ఈ మార్కులు చూసి నువ్వేం సాధించలేవని చాలా మంది అన్నారని అవనిశ్ శర్మ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. సుమేరా కలెక్టర్ కాక ముందు ఓ పాఠశాల ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు.   

Leave a Comment