ఎంజైమాటికా కీలక ప్రకటన..20 నిమిసాల్లో వైరస్ ఖతం..!

స్వీడన్ కు చెందిన లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా కీలక ప్రకటన చేసింది. తమ మౌత్ స్ప్రేతో కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్ ను నిరోధించవచ్చని చెప్పంది. సార్స్-కోవ్2 వైరస్ ను ఈ స్ప్రే క్రియారహితం చేస్తుందని తమ ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ లో ప్రకటించింది. 

ఎంజైమాటికాకు చెందిన ‘కోల్డ్ జైమ్’ కరోనా వైరస్ ను 98 శాతం నాశనం చేస్తుందని కంపెనీ తెలపింది. కోల్డ్ జైమ్ సామాన్యంగా సాధారణ జలుబుకు ఉపయోగిస్తారు. అయితే ఇన్ విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయనం ప్రకారం కరోనా జాతికి చెందిన పలు రకాల వైరస్ లను నిరోధించడానికి ప్రభావవంతంగా పని చేసిందని కంపెనీ పేర్కొంది. కరోనా వైరస్ ను నాశనం చేయడంలో దీని సామర్థ్యాన్ని అంచనా వేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుత ఇన్ విట్రో ఫలితాల ద్వారా నేరుగా క్లినికల్ ట్రయల్స్ కు వెళ్లే శక్తి లేనప్పటికీ సమర్థవంతంగా వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని ఫలితాల ద్వారా వెల్లడైందని ఎంజైమాటికా పేర్కొంది.

 

Leave a Comment