విక్రమ్ ’కోబ్రా‘ ఫస్ట్ లుక్..

హీరో విక్రమ్ కమల్ హసన్ ను ఫాలో అవుతున్నారు. కమల్ హసన్ దశవతారం సినిమాలో పది అవతారాలతో చేసిన రీతిలోనే విక్రమ్ కూడా భిన్న అవతారాలతో కనిపించబోతున్నాడు.అజయ్ జ్నానముతు దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విక్రమ్ ఏడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చేస్తే అర్థమవుతుంది. కొన్ని పాత్రలు విక్రమ్ ను గుర్తించగలిగేలా ఉన్నాయి కానీ మరికొన్ని పోలికలు కూడా దొరకడం లేదు. ఈ పోస్టర్ లో విక్రమ్ కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ అరుస్తుంటే అద్దంలో మిగిలిన తర రూపాలు కనిపిస్తున్నట్లుగా ఉంది. అయితే కోబ్రా సినిమాలో విక్రమ్ 20 పాత్రల్లో కనిపిస్తారని తమిళ చిత్ర సీమలో ప్రచారం జరుగుతోంది. కోబ్రా చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Comment