కోబ్రా కమాండో రాకేశ్వర్ ఫొటో విడుదల చేసిన మావోయిస్టులు..!

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ సమయంలో కోబ్రా కమాండో మావోయిస్టులకు చిక్కిన విషయం తెలిసిందే.. తాజాగా రాకేశ్వర్ సింగ్ ఫొటోను మావోయిస్టులు విడదల చేశారు. రేకేశ్వర్ తమ దగ్గరే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఐదు రోజులుగా బందీగా ఉన్న రాకేశ్వర్ విడుదల చేస్తామని, మధ్యవర్తులను ప్రకటించాలని మంగళవారం మావోయిస్టులు ప్రకటన చేశారు. 

అయితే జవాన్ క్షేమంగా ఉన్నట్లు సాక్ష్యాలు చూపిస్తే మధ్యవర్తులను ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో బుధవారం రాకేశ్వర్ సింగ్ ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు.  అయితే మావోయిస్టులతో చర్చలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 

 

Leave a Comment