పొగడ్తలు వద్దు.. విమర్శించండి.. సరి చేసుకుంటా .. మీడియాతో సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎంకే స్టాలిన్ ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన నిర్ణయాలను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇక మీడియా కూడా ఆయన్ను పొగడ్తు కథనాలు ప్రచురిస్తుంది. ఈ నేపథ్యంతో సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పొగడ్లతో ముంచెత్తే కథనాలు కాకుండా.. ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు, విమర్శలు ఉంటే ఎత్తి చూపించాలని మీడియాతో అన్నాడు. తమ లోపాలను సరిచేసుకుంనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్టాలిన్ అన్నారు. 

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నేతృత్వంలో ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమాంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను, తమ పనితీరును పొగడ్తలతో ముంచెత్తాలని తాను ఎన్నడూ మీడియాను ఆదేశించలేదన్నారు. విమర్శలు ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి దిశగా తమ పయనం సాగుతోందని వివరించారు. రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, రూ.2 లక్షల కోట్లు పబ్లిక్ రంగ సంస్థలు సైతం అప్పుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. నిధుల సమీకరణకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నామన్నారు. జీఎస్టీ రూపంలో రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సీఎం స్టాలిన్ విమర్శించారు.  

Leave a Comment