విద్యార్థిని ఇంట్లో టిఫిన్ చేసిన సీఎం స్టాలిన్..!

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ విద్యార్థిని ఇంటికెళ్లి టిఫిన్ చేశారు. సాంబర్ ఇడ్లీ తిని, బాలికకు ఆప్యాయంగా తినిపించారు. ఇటీవల వెనకబడిన వర్గాల వారి దుస్థితిపై వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు సీఎం స్టాలిన్ త్వరలోనే వారి నివాసలకు వెళ్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ఆవడి సమీపంలోని తిరుముల్లవాయల్ పరిసరాల్లో నివసించే సంచారజాతుల నివాసాలకు సీఎం స్టాలిన్ శుక్రవారం వెళ్లారు. 

అక్కడి ప్రజలతో సీఎం స్టాలిన్ కొద్దిసేపు ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి అవడి బస్ స్టేషన్ సమీపంలోని సంచారజాతుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ఓ ఇంట్లో ఇడ్లీ తిని ఒక బాలికకు తినిపించారు. ఇడ్లీతో పాటు పెట్టిన నాటుకోడి కూర కారంగా ఉందంటూ సీఎం స్టాలిన్ సరదాగా మాట్లాడారు. 

ఆ తర్వాత అక్కడి ప్రజలకు సీఎం ఆరోగ బీమా పథకం కార్డు, రేషన్ కార్డులు, సామాజిక రక్షణ పథకం కింద ఆర్థిక సాయం, ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సంచార జాతులకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. వారి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. 

Leave a Comment