కోవిడ్ మరణాల నియంత్రణకు సీఎం జగన్ కీలక నిర్ణయం..!

రాష్ట్రంలో కోవిడ్ మరణాల నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అత్యవసర మందులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన హెటిరో ఫార్మా తయారు చేస్తున్న రెమ్ డెసివిర్ డ్రగ్స్ ను ఆస్పత్రుల్లో 15 వేలకుపైగా డోసులను అందుబాటులో ఉంచనున్నారు. 

ఆగస్టు మూడో వారం నాటికి మొత్తం దాదాపు 90 వేలకుపైగా రెమ్ డెసివిర్ డోసులను సిద్ధం చేయనుంది. ఒక్కో రోగికి 5 నుంచి 7 డోసుల వరకు రెమ్ డెసివిర్ ను వాడాల్సి వస్తుంది. ఇలా ఒక్కొక్కరిపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.35వేలు ఖర్చు చేయనుంది. 

Leave a Comment