ఏలూరులో బాధితులను పరామర్శించిన సీఎం జగన్..!

ఏలూరు వింత వ్యాధితో అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధితో అనారోగ్యం పాలైన వారి సంఖ్య 350 దాటింది. అలాగే రెండు మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా అస్వస్థతకు గురైన వారిని సోమవారం సీఎం జగన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. 

  

Leave a Comment