1088 అంబులెన్స్ లను ప్రారంభించిన సీఎం జగన్..!

రాష్ట్రంలో సీఎం జగన్ 108 అంబులెన్స్ సర్వీసుల విషయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మళ్లీ కుయ్, కుయ్ అన్న కూతలు వినిపించేలా చర్యలు తీసుకున్నారు. అత్యంత అధునాతనంగా, అత్యంత మెరుగైన వైద్య సేవలందించడమే కాకుండా రాష్ట్రంలో ప్రతి చోట సేవలందించేలా ఆ సర్వీసులను తీర్చిదిద్దారు. వాటి సంఖ్యను కూడా పెంచారు. ఇందులో భాగంగా 1088 వాహనాలను (108, 104 సర్వీస్ అంబులెన్స్) సీఎం జగన్ బుధవారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 

కొత్తగా 412, 108 సర్వీస్ అంబులెన్స్ లను సిద్దం చేశారు. వాటిలో 282 బేసిక్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్(బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్)తో తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్ లను చిన్నారులకు(నియోనెటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. 

108 అంబులెన్స్ లో సదుపాయాలు..

  • బీఎల్ఎస్ అంబులెన్స్ లలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 
  • ఏఎల్ఎస్ అంబులెన్స్ లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. 
  • నియో నేటల్ అంబులెన్స్ లలో ఇన్ క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. 

ఈ అంబులెన్స్ లు పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో చేరుతాయి. 

104 సర్వీసులల సదుపాయాలు..

ఇందులో భాగంగా కొత్తగా 656 ఎంఎంయూ(మొబైల్ మెడికల్ యూనిట్)లను తీర్చిదిద్దారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఎంఎంయూలో ఒక వైద్యాధికారి, డేట ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎంతో పాటు, ఆశా వర్కర్ ఉంటారు. ఇవి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. 

ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్(ఏవీఎల్టీ), గ్లోబల్ పొజిషనింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఆధార్ కోసం బయోమెట్రిక్ పరికరాలు, రోగుల డేటాను ఆన్ లైన్ లో అప్ డేట్ చేసేందుకు ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ ఉంటాయి. ఎంఎంయూలో 20 రకాల సేవలను అందించనున్నారు. 

Leave a Comment