మహిళల భద్రత కోసం ‘అభయ్ ప్రాజెక్ట్’ ప్రారంభించిన సీఎం జగన్..!

ఏపీలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘అభయ్ ప్రాజెక్ట్’ను సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు రవాణా శాఖ పర్యవేక్షణలో అమలవుతుంది. ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. 

రాష్ట్రంలోని ప్రతి ఆటో, క్యాబ్ లో దశల వారీగా ట్రాకింగ్ డివైజ్ లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత వెయ్యి ఆటోల్లో ఏర్పాటు చేసి, వచ్చే ఫిబ్రవరి 1 నాటికి 5 వేల వాహనాలు, జులై 1 కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబర్ 31 నాటికి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది.

ఎలా అమలవుతుందంటే..

  • ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణించే వారు తమ మొబైల్ లో ‘అభయం’ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. 
  • వాహనం ఎక్కే ముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే, డ్రైవర్ ఫొటో, వహనం వివరాలు మొబైల్ కు వస్తాయి.
  • ఇక ప్రయాణించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబర్ పంపితే చాలా వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది.
  • స్మార్ట్ ఫోన్ లేని వారు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కితే సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుతుంది. ఆ వాహనం వెంటనే ఆగిపోతుంది. సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. 
  • ఐవోటీ ఆధారిత బాక్సలను ఆటోలు, క్యాబ్ లకు అమర్చిన తరువాత డ్రైవర్ల లైసెన్సులకు రేడీయో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు ఇస్తారు. ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ లైసెన్స్ కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ అవుతాయి.  

 

Leave a Comment