‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్‌

వైఎస్సార్ కాపు నేస్తం రాని వారు ఆందోళన చెంవద్దని, వెంటనే దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెలలో వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ’వైఎస్సార్‌ కాపు నేస్తం’  పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు.

ఇప్పుడు బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి రూ.15 వేల చొప్పున సహాయం అందించామని పేర్కొన్నారు. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లిస్తామన్నారు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నామన్నారు. ఎవరైనా ఇంకా రాని వారు ఉంటే అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

Leave a Comment