18న కర్నూలుకు సీఎం జగన్‌ – షెడ్యూల్‌ ఖరారు

 కర్నూలు : కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. 

– ఉదయం తొమ్మిది గంటలకు ఆయన తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు

– అక్కడ నుంచి  10.30 నిమిషాలకు ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని హెలీకాఫ్టర్‌లో కర్నూలు ఎస్‌ఏసీ క్యాంపులో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

– అనంతరం రోడ్డు మార్గంలో 11 గంటలకు ఎస్టీబీసీ గ్రౌండ్‌లో సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సబ్‌ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్‌ అధికారులను సత్కరించనున్నారు.

–  11.20 నిమిషాలకు  బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

– 12.50 నిమిషాలకు ఎస్టీబీసీ గ్రౌండ్‌ నుంచి బయలుదేరి ఎస్‌ఏసీ క్యాంపులో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

– 1.20 నిమిషాలకు ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి విమానంలో 2.30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని సీఎం తన నివాసానికి వెళతారు.

 

Leave a Comment