పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్..!

12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంకల్ భాగ్ ఘాట్ లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమంలో పాల్గొన్నారు. ఈ పుష్కరాలు నేటి నుంచి 12 రోజుల పాటు అంటే డిసెంబర్ 1 వరకు జరుగుతాయి. 

కోవిడ్ నేపథ్యంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సంప్రదాయ పద్ధతిలో, శాస్త్రోక్తంగా పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.230 కోట్లను ఖర్చు చేసింది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో 23 పుష్కర ఘాట్లు రూపుదిద్దుకున్నాయి. 

కాగా కోవిడ్-19 నేపథ్యంలో భక్తులు నదిలోకి వెళ్లి పుష్కర స్నానాలు ఆచరించేందుకు అధికారులు అనుమతి ఇవ్వేలేదు. పిండప్రదానాలకు అవకాశం కల్పించారు. ఇందుకు ఈ టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. 23 ఘాట్లలో 350 మంది పురోహితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో పురోహితుడు రోజుకు 16 స్లాట్ల చొప్పున పూజలు చేస్తారు. పుష్కర ఘాట్లలోకి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తారు. 

Leave a Comment