ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన..!

ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్ లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయగా, మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేదుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, అయినా మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉన్నాయని అన్నారు. వారి జీవితాలను పాదయాత్రలో కళ్లారా చూసి చలించిపోయానన్నారు. మత్స్యకారుల జీవితాలను మార్చాలన్న లక్ష్యంతోనే అడుగులు వేశామన్నారు.

ఇప్పుడు మరో ముందడుగు వేసి నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్ లకు శంకుస్థాపన చేశామన్నారు. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడి మడక, పశ్చిగ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్త పట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు.  

Leave a Comment