సినిమా చూసి బోరున ఏడ్చేసిన సీఎం.. ఏ సినిమా అంటే?

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఓ సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు.. రక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను సీఎం చూశారు. ఆ సినిమా చూసిన సీఎం బొమ్మై ఎమోషనల్ అయ్యారు. అందులో సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఎమోషనల్ అవ్వడానికి అందులో ఏముందనుకుంటున్నారా..

ఈ సినిమాకు కిరణ్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బంధాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సన్నివేశాలు చూసిన సీఎం బసవరాజ్ బొమ్మై ఒక్కసారిగా కంట కన్నీరు పెట్టుకున్నారు. 

గతంలో సీఎం బొమ్మై స్నూబీ అనే కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్క చనిపోయింది. దాని అంత్యక్రియల సమయంలోనూ ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. ఓ ఇంటర్వ్యూలోనూ స్నూబీ ఫొటోలను చూపించినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘777 ఛార్లీ’లో సన్నివేశాలు ఆయనకు స్నూబీని గుర్తుకు తెచ్చినట్లు ఉన్నాయి. అందుకే ఆయన బోరున ఏడ్చేశారు. 

కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయని, కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారని ఆయన అన్నారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుందని, సినిమా చాలా బాగుందని, అందరూ తప్పకుండా చూడాలని తెలిపారు. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ అని, చాలా స్వచ్ఛమైనదని అన్నారు. 

 

 

 

Leave a Comment