సూర్యడి అత్యంత స్పష్టమైన ఫొటో.. ఎలా ఉందో చూడండి..!

సూర్యడి అత్యంత స్పష్టమైన ఫొటోను తీశాడు ఓ ఖగోళ ఫొటో గ్రాఫర్..మండే అగ్ని గోళంలా కనిపించే నిండు సూర్యుడిని ఓ సోలార్ ఆర్బిటార్ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో బంధించాడు. సూర్యుడిని అంత సమీపంగా, అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటో గ్రాఫర్ గా ఆండ్రూ మెక్ కార్థీ అనే ఖగోళ ఫొటో గ్రాఫర్ నిలిచాడు. 

ఆండ్రూ దీని 300 మెగాపిక్సెల్ కెమెరాను ఉపయోగించాడు. ఇది సాధారణ 10 మెగాపిక్సెల్ కెమెరా ఇమేజ్ కంటే 30 రెట్లు పెద్దది. ఈ స్పష్టమైన ఇమేజ్ రావడం కోసం ఆండ్రూ 1,50,000 చిత్రాలను తీసి వాటిని లేయర్ చేశాడు. ఈ ఫొటోల్లో సూర్యునిపై డార్క్ సన్ స్పాట్స్, ఈక ఆకారంలో ఆకృతి, స్విర్ల్ కంటికి కనిపించేంత స్పష్టంగా ఉన్నాయి. 

ఇక ఈ ఇమేజ్ లో నల్లటి చుక్కలను ఫొటో షాప్ తో ఎడిటింగ్ చేశాడు. సూర్యడిలో చాలా ప్రకాశవంతమైన ఫొటోలు తీయడం ప్రమాదంతో కూడిన ప్రక్రియ. ఒక్కోసారి ఫొటో గ్రాఫర్ తన చూపును కూడా కోల్పోయే ప్రమదం ఉంది. వీటిని నివారించడానికి రెండు ఫిల్టర్లు ఉన్న ప్రత్యేక టెలిస్కోప్ వాడాడు.   

Leave a Comment