రూ.2 వేల నోటుపై ఆర్బీఐ క్లారిటీ..!

ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2 వేల నోటు పెద్దది. అయితే కొంత కాలంగా రూ.2 వేల నోటును రద్దు చేస్తారన్న పుకార్లు వచ్చాయి. వీటన్నింటికీ ఆర్బీఐ క్వారిటీ ఇచ్చింది. రూ.2 వేల నోటు చలామణి క్రమంగా తగ్గుతోందని, గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం క్లారీటీ ఇచ్చింది.

 2018 నుంచి ఈ నోట్ల చలామణి క్రమంగా తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2018 నుంచి రూ.500 మరియు రూ.200 నోట్ల చలామణి గణనీయంగా పెరిగిందని తెలిపింది.  చెలామణిలో ఉన్న 2 వేల కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి నాటికి 33 వేల 632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివిర నాటికి 32 వేల 910 లక్షలకు పడిపోయిందని ఆర్బీఐ చెప్పింది.

2020 మార్చి చివరి నాటికి 27 వేల 398 లక్షలకు పడిపోయినట్లు ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. 2020 మార్చి ఆఖరుకు మొత్తం నోట్ల వాల్యూమ్ లో 2.4 శాతం 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయని, ఇది 2019 మార్చి చివరి నాటికి 3 శాతం, 2018 మార్చి నాటికి 3.3 శాతం తగ్గిందని పేర్కొంది. 2020 మార్చి చివరి నాటికి 22.6 శాతానికి పడిపోయింది. నకిలీ నోట్ల విషయానికొస్తే, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2 లక్షల 96 వేల 695 నోట్లను గుర్తించారు. వాటిలో 17,020 రూ.2 వేల నోట్లు ఉన్నాయి. 

  

 

You might also like
Leave A Reply

Your email address will not be published.