త్వరలో ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 3’.. ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎఫ్-2 2019 సంక్రాంతి కానుకగా రిలీజై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ లు కథానాయికలుగా నటించగా, శ్రీ వెంకటేశ్వ సినీ క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మించారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 

ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్-3 రూపొందిస్తున్నారు. ఎఫ్ 2 సినిమాలో భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో గొడవలు జరిగితే, ఎఫ్ 3 సినిమాలో డబ్బు వల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జరిగాయనేది చూపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సినిమా యూనిట్ ప్రకటించింది. ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

 

Leave a Comment